ప్రతి ఆస్పటల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమ నిబంధనలో అనుసరించికోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు
ప్రతి ఆస్పటల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమ నిబంధనలో అనుసరించికోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేట్ హాస్పిటల్ అప్రూవల్ మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్ పైన కలెక్టర్ చాంబర్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్లు నామ్స్ ప్రకారం నిర్వహించాలని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రజలకు సేవలందించాలని అన్నారు.ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరు క్లినిక్ ల ను హాస్పిటల్స్ ను ఆమోదించడం జరిగినదనీ, మెటర్నల్ డెత్ సర్వేలెన్సు ఆడిట్ పైన నిర్దేశించిన కమిటీ మెంబర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలిసి నిర్వహించాలని ఆమె ఆదేశించారు.ఎవరైనా గర్భిణీ స్త్రీలకు సరియైన ఆరోగ్య వైద్య విధానాలను బోధించి ఎలాంటి మాతృ మరణాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపారు. గర్భిణీ నమోదు చేసుకున్న వెంటనే వారికి అందించవలసిన సేవలపై వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం సేవలందిస్తూ, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి అందించే న్యూట్రిషన్ ఫుడ్ ఎం సి హెచ్ న్యూట్రిషన్ ఫుడ్ ను అందించి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై తగు శ్రద్దలు తీసుకొని వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేటట్లు ప్రోత్సహించాలని సిబ్బందిని కోరారు.ప్రైవేటు హాస్పిటల్ యజమాన్యం ఎవరైనా అనవసరంగా సి సెక్షన్ ఆపరేషన్లు చేయకుండా గర్భవతి కి వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చూడాలని కోరినారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ని ఎం సి హెచ్ పోర్టల్ లో నమోదు చేసి వారికి గర్భం ధరించిన సమయంలో నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించి వారికి అందించవలసిన ధనుర్వాతా సూదులు,రక్త వృద్ధి కొరకు ఐరన్ పోలిక ఆసిడ్ మాత్రలు మరియు పౌష్టిక ఆహారము ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుండి వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ నుంచి అందిస్తున్నామని తెలిపినారు.గర్భిణీ స్త్రీలకు ఏమైనా సమస్యలు ఉండి రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే ప్రత్యేకంగా వారికి వైద్య ఆరోగ్యశాఖ నిపుణుల ద్వారా పరీక్షల నిర్వహించి మాతా శిశు ఆరోగ్యం బాగుండేటట్లు సేవలు అందిస్తున్నామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు, ప్రోగ్రాం అధికారిని డాక్టర్ పద్మశ్రీ, సి కె ఎం, సిఎస్సి వర్ధన్నపేట ,డిహెచ్ నర్సంపేట సూపర్డెంట్లు డాక్టర్ నిర్మల, డాక్టర్ నరసింహస్వామి, డాక్టర్ మనోజి లాల్, పోలీస్ డిపార్ట్మెంట్ సీఐ, నోడల్ అధికారులు అనిల్ కుమార్, విజయలక్ష్మి ,వెంకటేశ్వర్లు మరియు ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్ఎం, ఆశాలు ,పాల్గొన్నారు.