శ్రీ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థుల అపూర్వ విజయం – (SSC) పరీక్షల్లోనూ 100% ఉత్తీర్ణత

 

(రామచంద్రాపురం మండలం, సంగారెడ్డి జిల్లా) బీరంగూడ శిరిడి సాయి కాలనిలో గల శ్రీ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించింది. బుధవారం విడుదలైన పదవ తరగతి (SSC) పరీక్షల్లో పాఠశాల విద్యార్థులందరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. ముఖ్యంగా, పాఠశాలలోని 27 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం విశేషం. డి.వైష్ణవి అనే విద్యార్థిని అత్యధికంగా 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచింది. దీంతో పాఠశాలలో సంబరాల వాతావరణం నెలకొంది. ఈ అపూర్వ విజయం విద్యార్థుల యొక్క నిరంతర శ్రమ, పట్టుదల మరియు అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సోనుకుమార్ యాదవ్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘన విజయం కేవలం విద్యార్థుల యొక్క అవిరళ కృషి ఫలితమే కాకుండా, ఉపాధ్యాయుల యొక్క నిరంతర ప్రోత్సాహం మరియు వారి యొక్క అంకిత భావానికి కూడా తార్కాణమని కరస్పాండెంట్ బి.సుషిల్ వర్మ పేర్కొన్నారు. శ్రీ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి అత్యుత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడమే ఈ అపూర్వ విజయానికి ప్రధాన కారణమని ప్రిన్సిపాల్ సోను కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా, అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులను, అలాగే ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ పాఠశాల డైరెక్టర్ శ్రీమతి హరిప్రియ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల యొక్క అకుంఠిత దీక్ష, అలుపెరగని కఠోర శ్రమ మరియు వారి యొక్క బలమైన పట్టుదలే ఈ అద్భుతమైన విజయాన్ని సాధ్యం చేసిందని ఆమె గర్వంగా తెలిపారు.
ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో శ్రీ వైష్ణవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీమతి హరిప్రియ , కరస్పాండెంట్ శ్రీ సుషిల్ వర్మ గారు, ప్రిన్సిపల్ శ్రీ సోనుకుమార్ యాదవ్ గారు, ఇన్చార్జి శ్రీమతి మేఘన , పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థుల యొక్క
ప్రకాశవంతమైన భవిష్యత్తును ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యా సంవత్సరాల్లోనూ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking