పందెంవాగు బఫర్ జోన్ రహదారి కట్టడి

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 మే 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ నాయకులు పుప్పాలగూడ లోని తిరుమల హిల్స్ పరిసర ప్రాంతం ప్రజలను కలుసుకొని స్థానిక సమస్యల సేకరణలో భాగంగా: రోడ్డు నంబర్ 14 పందెం వాగు వరకూ విస్తరించి ఉండగా బఫర్ జోన్ రహదారి స్థలాన్ని రాజకీయ పరపతితో రిజిస్టర్ చేయించుకొని అడ్డుగా గోడ కట్టడం వలన, ఆ ప్రక్కనే మట్టి దిబ్బల మూలంగా వర్షాకాలంలో పై నుండి వచ్చే వరద నీరు సాఫీగా వాగులోకి వెళ్ళడానికి అవకాశం లేనందువలన అట్టి వరద నీటికి కొన్ని అపార్ట్మెంట్లు ముంపుకు గురవుతున్నావని వాపోయారు. రహదారికి అడ్డుగా కట్టిన స్థలంలో 4 ఇంచిల నీటి సరఫరా పైప్ లైన్ ఉందన్న విషయం కూడా వెల్లడించారు. మంచినీటి సరఫరా సరిగా లేకపోవడంతో, బోరింగులలో నీటిమట్టం లేనందువలన ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధార పడుతున్నామని ఇదే సాకుగా వారు నిలువు దోపిడీ చేస్తున్నారని అల్లాడి పోతున్నారు. రోడ్డు నంబర్ 14 చివరలో విద్యుత్ సరఫరా సరిగా లేదని పై పెచ్చు వీధి దీపాలు వెలగడం లేవని చిమ్మ చీకటిలో బయటకు రావడానికి స్థానికులు జంకుతున్నారని తెలిపినారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనులు సక్రమముగా సరి చేయాలని బి.ఆర్.ఎస్ నాయకులు కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, ఉపేంద్రనాథ్ రెడ్డి, బుద్ధోలు బాబు, బండమీది మల్లేష్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్, సుమనళిని, యాలాల కిరణ్ డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking