ఎమ్మెస్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (సిఐటియు ) ఆధ్వర్యంలో
జెండా ఆవిష్కరించిన కంపెనీ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ టీ పెంటయ్య
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 1. (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం సూర్ రెడ్డి ఇటిక్యాల గ్రామ శివారులో గల ఎమ్మెస్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్మికులు మేడే సందర్భంగా ఈరోజు (సిఐటియు )ఆధ్వర్యంలోకంపెనీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి తెనుగు పెంటయ్య, జెండా ఆవిష్కరణ చేశారు, ఈ కార్యక్రమానికి (సిఐటియు ) జిల్లా కార్యవర్గ సభ్యుడు అందోల్ డివిజన్ ( సిఐటియు) కార్యదర్శి విద్యాసాగర్,ఈకార్యక్రమంలో పాల్గొని, ఈ సందర్భంగా ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికులకు పండుగ రోజు అని, ఎందుకంటే గతంలో 1889లో చికాగో నగరం అమెరికాలో కార్మికులు పని గంటలకు కోసం పోరాడి ఎంతోమంది అక్కడ రక్తం చిందించిన పరిస్థితి ఉండే, ఆ రోజుల్లో కార్మికులు 14 గంటలు పనిచేసే అవకాశం ఉండేది, పొద్దున 8 గంటలకు పనికి పోతే సాయంత్రం 10,11, గంటలకు ఇంటికి వచ్చేవారు, అంటే ఒక రకంగా చెబితే చిన్నపిల్లలు నిద్రలేవకముందే పనికి పోయి సాయంత్రం చిన్నపిల్లలు నిద్ర పోయిన తర్వాత ఇంటికి వచ్చేవారు, అంటే ఒక రకంగా వాళ్లు తల్లిదండ్రులను గుర్తుపట్టే పరిస్థితి లేదు, ఆరోజుల్లో కార్మికులందరూ కులమతాలకు అతీతంగా మూడురోజులపాటుసమ్మె చేస్తే అక్కడే కార్మికులు ఎంతో మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి చనిపోయిన కార్మికుల రక్తం మరకల బట్టలను పైకెత్తి ఎర్రజెండాగా మార్చిన చరిత్ర, రక్తం మరకలతో తడిచిన జెండా ఈరోజు ఎర్రజెండాగా మారిందని అన్నారు, ఈ జెండా ఆషామాసి జెండా కాదని అందుకే ఈరోజు కార్మికులందరూ మేడే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆరోజు చేసిన పోరాటం వల్ల ఈరోజు 8 గంటల పని దినం మనకు ఉందని అన్నారు, ఈరోజు కార్మికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, అందుకే మేడే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడాలి అని కార్మికులకు ఈరోజు కనీస వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ( ఈఎస్ఐ పీఎఫ్ ) ఇవ్వాలి కార్మికులకు భరోసా కల్పించే రీతిన ఉండాలని అన్నారు, కానీ కార్మికులను ఈరోజు యాజమాన్యాలు శ్రమ దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు ఉందని అన్నారు అందుకే ఈరోజు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మికులకు అండగా (సిఐటియు) ఉంటుంది, అందుకే ఈరోజు ఎర్రజెండా ఆశమాసి కాదని కానీ ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ జెండా మాత్రం ఇలాగే ఉంటుందని అందుకే ఈరోజు పేదల పక్షాన కార్మికుల పక్షాన ఎర్రజెండా ఉంటుందని, గుర్తుంచుకోవాలి అందుకే ఈరోజు (సిఐటియు )ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎర్రజెండా రెవరపలాడుతుందని అందుకే రాబోయే రోజుల్లో హక్కులు సాధించుకునే వరకు మేడే స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్మికులు ముందుకు రావాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ కార్మికులు (సిఐటియు )కంపెనీ కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు…..