పెహల్గావ్ చర్యను ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 మే 2025


పెహల్ గావ్ లోని బైసరీన్ వ్యాలీలో పర్యటిస్తున్న సందర్శకులపై దాడిచేసి కాల్పులు జరిపి 26 మందిని చంపడం కొంత మందిని గాయ పరచడం దారుణమని, పిరికి పంధ, హేయమైన చర్య అని అట్టి దాడిని ఖండిస్తూ మణికొండ పరిధిలోని ల్యాంకో హిల్స్ నుండి మర్రి చెట్టు కూడలి వరకు భారత్ మాతకి జై, టెర్రరిజం నశించాలి, దూద్ మాంగేతో ఖిర్ దేంగే కాశ్మీర్ మాంగేతో చీర్ దేంగే లాంటి నినాదాలతో బుధవారం రోజున పాదయాత్ర క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించడం జరిగినది, ఇందులో హ్యూమన్ రైట్స్ ఫెడ్రేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు శరద్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ కర్ణాటపు, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫ్ఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాస్, చైర్మన్ బండ రాంరెడ్డి, ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, షేక్ ఆరిఫ్, బొడ్డు శ్రీధర్, విశ్వగురు ట్రస్టు వేణుగోపాల్, టీచర్స్ ఫెడరేషన్ విజయ్ సింగ్, అమిత్ భరద్వాజ్, గ్రేటర్ అల్లకాపూర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు స్థానికులు, దేశ ప్రేమికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking