వేములవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య భవన్లో 139వ మే డే ను పురస్కరించుకొని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాముల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండాను వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ 139 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్మికుల బ్రతుకులు మారడం లేదని, 8 గంటల పని విధానం అమలు కావడం లేదని, కనీస వేతనాలు నేషనల్ పే స్కేల్ చెప్పిన విధంగా అమలు జరగడం లేదని, కాంట్రాక్ట్ అని, ఔట్సోర్సింగ్ అని ప్రజాస్వామ్యంలోనే దోపిడీ చేస్తున్నారని ఈ విధానాలు మారాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్ లుగా అమలుపరచడాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి గాజుల పోశెట్టి, మండల కార్యదర్శి శ్రీ రాముల నరసయ్య, ఎల్లా దేవరాజ్, మున్సిపల్ నాయకులు, పందుల మల్లేశం, నరసయ్య, కె.వి అనసూయ, పెంట గట్టవ్వ, భూమవ్వ, వాల్మీకి, ఊర్మిళ, పుష్పలత, పెంట రాజవ్వ, పెంట నరేష్, పెంట మల్లేశం, బిగుళ్ల మల్లేశం, సుంకపాక పరశురాం, కోరేపు క్రాంతి, కోరపు శ్రీను, కల్లెపెల్లి నర్సయ్య, పండుగ పోచమల్లు, పండుగ చంద్రయ్య తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking