జిల్లాలో సజావుగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

 

ఓటు హక్కును వినియోగించుకొన్న 5,460 ఉపాధ్యాయులు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 83.54 శాతం పోలింగ్ నమోదు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 13:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 6,536 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా అందులో ఎన్నికల సమయం ముగిసేటప్పటికి 5,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అందులో మహిళా ఓటర్లు 2,905 మంది, పురుషులు 2,555 మంది ఉన్నారు. దీంతో జిల్లాలో 83.54 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లాలోని కీసరలో 8 పోలింగ్ కేంద్రాలు, మల్కాజిగిరిలో 6 పోలింగ్ కేంద్రాల అన్నింటిలోనూ అన్ని వసతులు సమకూరిచినాము అని స్పష్టం చేసినారు వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలించారు. దీంతో పాటు మైక్రో అబర్జర్వర్లు, పోలీసులు ఓటింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకొన్నారు. ఉదయం ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం వరకు ప్రశాంతంగా ముగిశాయి అని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking