ఒంగోల్లులో వైభవంగా ప్రారంభమైన ఉషోదయ సూపర్ మార్కెట్ నూతన (31వ) స్టోర్

ఉన్నత వ్యాపార విలువలతో.. కస్టమర్ల ఆదరణను చూరగొనడమే లక్ష్యంగా ముందుకు సాగే ప్రతి వ్యాపార సంస్థా.. చక్కని పురోభివృద్ధి సాధిస్తుందని, తమ ఉషోదయ సూపర్ మార్కెట్ ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ అని ‘ఉషోదయ సూపర్ మార్కెట్ ‘ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం . యుగంధర్ అన్నారు. జూలై 17 వ తేదీ బుధవారం ఒంగోలులో తమ సంస్థ 31వ స్టోర్ ప్రారంబించారు.
Inauguration by – Shri Damacharla Janardhana Rao MLA, Ongole Constituency
Lighting of the lamp by Shri Magunta Sreenivasulu Reddy MP, Ongole Constituency
Chief Guest Shri Unnam Muralidhar Rao Senior Advocate
Guest of Honour Shri Sidda Hanumantha Rao Managing Director, KSG Group

అనంతరం శ్రీ యుగంధర్ విలేఖరులతో మాట్లాడుతూ.. 2005వ సంవత్సరంలో హైదరాబాద్ లోని ఏ ఎస్ రావునగర్లో తమ ఉషోదయ సూపర్ మార్కెట్ తొలి స్టోర్ను ఏర్పాటు చేశామని, కొద్ది కాలంలోనే కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొని, వారి ఆదరాభిమానాలే సోపానాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందామని, తమ నాణ్యత, నమ్మకం.. వాటితో లభించిన కస్టమర్ల ఆదరణతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని ఆయన వివరించారు. ప్రస్తుతం నూతనంగా ప్రారంభమైన ఈ స్టోర్.. తమ సంస్థకు 31వ స్టోర్ అని, తెలంగాణ19 స్టోర్లు, ఆంధ్రప్రదేశ్లో 12 స్టోర్లు ఉన్నాయని, అన్నీ విజయపథంలో పురోగమిస్తున్నాయని తెలిపారు. అలాగే గుడివాడలో కూడా త్వరలో తమ నూతన బ్రాంచ్ను ప్రారంబించబోతున్నామ్మని తెలిపారు. తమ స్టోర్లలో నిత్యావసర వస్తువుల నుంచి గృహోపకరణాల వరకు అన్నీ లభ్యమవుతాయని, అన్నీ నాణ్యతకు పెట్టిందిపేరని, ఉన్నత వ్యాపార విలువలతో కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుని పురోగమిస్తామని, మరిన్ని స్టోర్లను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking