అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఉత్కూర్ లో గల చౌరస్తాకు రాజ్యాంగ రచయిత,భారత రత్న,డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చౌక్ గా పేరు పెట్టాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు అన్నారు.సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రజలంతా నిత్యం అంబేద్కర్ చౌక్ గా పిలుచుకుంటున్న చౌరస్తాకు అంబేద్కర్ పేరు పెడితే బాగుంటుందన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుల పేర్లు పెట్టడం అంటే వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే నన్నారు. మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించడం చాలా మంచి శుభ పరిణామమన్నారు.వచ్చే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం నల్మాస్ కాంతయ్య మున్సిపల్ చైర్మన్ వచ్చే మున్సిపల్ సమావేశాల్లో భారతరత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడానికి మున్సిపల్ సామావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.బాబా సాహెబ్ భారత ప్రజలందరికి దైవ సామానుడని,అయన బాటలోనే తాము ప్రజా సేవ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దమ్మ నారాయణ,మాలెం చిన్నన్న, మండల ప్రధాన కార్యదర్శి భైరం రవి,మండల ఉపాధ్యక్షుడు భైరం లింగన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, అలుగునూరి నరేష్, చాతరాజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.