ఖేడ్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా సాయిలు.

 

సంగారెడ్డి జులై 15 ప్రజ బలం ప్రతినిధి:
నారాయణఖేడ్ నియోజకవర్గం సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది (ఏ జీ పీ) గా సాయిలును నియమిస్తూ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ జీ పీ గా నియమితులైన సాయిలు ను న్యాయవాది అలిగే జీవన్, మరియు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఖేడ్ మండలం, మాధ్వర్ గ్రామం. ఈ సందర్బంగా సన్మాన అనంతరం న్యాయవాది అలిగే జీవన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం లో జన్మించిన న్యాయవాది సాయిలు పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారని, ఎన్నో కష్ఠాలు అనుభవించి నేడు ప్రభుత్వ న్యాయవాది గా ఎన్నికైన సందర్బంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, సీనియర్ న్యాయవాదులు మారుతీ రెడ్డి, భోజీరెడ్డి, లక్ష్మన్ రావు, నర్సింహా రావు,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking