పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 15 : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడటం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జీవరాశి మనుగడ,పర్యావరణ పరిరక్షణ,వాతావరణ సమత్యులతను కాపాడటం లలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తారని,భావితరాలకు కాలుష్యం లేని స్వచ్ఛమైన సహాయ వాయువు అందించాలని మొక్కలు నాటి సురక్షించడం ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 20 లక్షలు,సింగరేణి సంస్థ 7 లక్షలు,అటవీ శాఖకు 9 లక్షలు,మున్సిపాలిటీలకు 7.50 లక్షలు,ఇతర శాఖలకు 1 లక్ష మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని,ఆయా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలని తెలిపారు.ఇండ్లలో సైతం మొక్కలు నాటి సురక్షించలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking