– విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీపీకి మంత్రి పొన్నం లేఖ
– ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ జమ్మికుంట కౌన్సిలర్ల వెల్లడి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 15
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అన్యాక్రాంతమైన భూములు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాసినట్టు కాంగ్రెస్ కౌన్సిలర్లు తెలిపారు. సోమవారం 23వ వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య మోత్కులగూడెంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వార్డులు ఇతర అభివృద్ధి పనుల కోసం ఇటీవల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసినట్టు వివరించారు. నిధుల మంజూరుకు మంత్రి హామీ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం త్వరలో కౌన్సిలర్ అందరం కలిసి సమావేశం కానున్నట్లు వెల్లడించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరిగిన నిధుల జరిగిన నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం విషయమై మంత్రి ప్రభాకర్ కు వినతి పత్రం సమర్పించినట్టు పేర్కొన్నారు. జీవో నంబర్ 58, 59 లతో ప్రభుత్వ భూములలో జరిగిన అక్రమ నిర్మాణాలపై విచారణకు ఆదేశించాలని కోరగా, మంత్రి వెంటనే స్పందించారు. సర్వే నంబర్లు 642, 652, 629, 887లలో జరిగిన అక్రమ నిర్మాణాల పైన ఎంక్వయిరీ చేయాలని కోరినట్టు చెప్పారు. మహిళా సంఘ భవనానికి కేటాయించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల విషయమై మంత్రి సీరియస్ గా స్పందించినట్టు పేర్కొన్నారు. మరో యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు సాయిని రవి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అర్హులైన నిరుపేదలకు భూమి ఇచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఏ అవసరమున్నా కౌన్సిలర్లను కలవాలని సూచించారు. గతంలో జరిగిన భూమి కబ్జాలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం మంత్రి ప్రభాకర్ కు వినతిపత్రం ఇచ్చినట్టు వెల్లడించారు. జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్దనున్న పాత మార్కెట్ పునర్ ప్రారంభించడానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కలిసి తీర్మానం చేయగా, మంత్రి ప్రభాకర్ చొరవతో ప్రజల సహాయ సహకారాలతో త్వరలో ప్రారంభించినున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు బొంగొని వీరన్న, రావి కంటి రాజు, పిట్టల శ్వేత రమేష్ , దేశినీ రాధా సదానందం, జి మొగిలి తదితరులు పాల్గొన్నారు.