ప్రజా బలం న్యూస్ తూప్రాన్
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో కౌన్సిలర్ మామిడి వెంకటేష్ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ కొరకు సీజనల్ వ్యాధుల నివారణ కోసం వ్యాక్సిన్ వేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ పాణి, శ్రీను గోపాలమిత్ర,, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు ఎక్కలదేవ్ వెంకటేష్ యాదవ్, వార్డు అధ్యక్షులు గుర్రం అంజనేయులు రైతులు స్వామి మల్లేష్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.