ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల వైద్యం కోసం ప్రవేశ పెట్టిన 5 లక్షల రూపాయలు భీమా పధకం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల నమోదు కార్యక్రమం దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలో బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఉచితంగా లబ్ధిదారుల నమోదు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ… దండేపల్లి మండలంలోని చింతపల్లి గ్రామం లోని ఈ శిబిరంలో గ్రామానికి చెందిన 400 పైగా కుటుంబాలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది.రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరిగింది తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బిజెపి పార్టీ నాయకులు శ్రీనివాస్, దండేపల్లి బిసి మోర్చ మండల అధ్యక్షుడు ముత్తె అనిల్ కుమార్,తల్లపల్లి వంశీ,గ్రామం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.