విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన చెందవద్దు

 

మానసిక ఒత్తిడిని జయించడానికి సులువైన మార్గాలు ఉన్నాయి

-డా.శివకృష్ణ న్యూరో సైకియాట్రిస్ట్

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని టేకులపల్లి సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో జరిగిన మోటివేషన్ క్లాస్ కు సంబంధించి ముఖ్య అతిథిగా శాన్వి హాస్పిటల్ ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డా.శివకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినిలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…. ముఖ్యంగా మేము ఆడపిల్లలము అనే వ్యక్తిత్వం కాకుండా తమపై తమకు విశ్వాసం, కృషి,పట్టుదల, క్రమశిక్షణ వుంటే ఏదైనా సాధించవచ్చని,మనలో వున్న లోపాలను బలహీనతలను అవకాశాలుగా మార్చుకోవాలని,ప్రపంచంలో గొప్ప మేదావులందరు సాధారణ కుటుంబం నుండి వచ్చినవారే అని అలాగే పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని అధిగమించి,మెదడును చురుకుగా వుంచుకుని ఇష్టపడి చదవాలని ఆయన అన్నారు….ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ జిల్లా చైర్మన్ పప్పుల వేణుగోపాల్,ఉపాధ్యాయులు,విద్యార్థినిలు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాన్వి హాస్పిటల్ డా.శివకృష్ణ ను శాలువాతో సన్మానించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking