తూప్రాన్ సెప్టెంబర్ 26( ప్రజా బలం న్యూస్) ::
దేశ స్వాతంత్రం కోసం భూమి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ దేశానికే ఆదర్శ మహిళమని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు .
మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రజకుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాదులో మూడు ఎకరాల స్థలంతో పాటు ఐదు కోట్ల రూపాయలు భవన నిర్మాణానికి కేటాయించారన్నారు దోబీ ఘాట్ నిర్మాణానికి రెండు కోట్ల స్థలం కేటాయించామని తెలిపారు. రజకుల అభివృద్ధికి రజక బంధు పథకం ద్వారా నెలకు 2 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రజకులను పట్టించుకోలేదని కేసీఆర్ ప్రభుత్వం రజకుల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి రాణి సత్యనారాయణ గౌడ్,చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రం, మనవడు సంపత్, తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్, కృష్ణ, రవీందర్ రెడ్డి ,సత్య లింగం, కమ్మరి శ్రీదర్,నాయకులు దన్రాజ్, సతీష్ చారి,సిద్దిరాములు , ప్రభాకర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, దామోదర్ రెడ్డి, నరేష్ ,ఉపేందర్ ,చంద్రారెడ్డి, రఘుపతి, అనిల్,బురానోద్దిన్ ,సమీర్, హజర్, ఉమర్,జాతీయ రజక సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్ ఉప్పలయ్య నర్సింలు లావణ్య పోతురాజు లింగం, కొట్టంల ఉపేందర్ ,బాయ్ కాడి నర్సింలు, ఆంజనేయులు ,సిద్ధ రాములు బాయికాడ ముత్యాలు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.