హైదరాబాద్ సెప్టెంబర్ 26 ();తెలంగాణా రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ప్రెసిడెంట్ మరియు తెలంగాణా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.విద్యానగర్ బిసి భవన్ లో జరిగిన వేడుకల్లోబిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షలు ఆర్.కృష్ణయ్య సమక్షం లో కేకును కట్ చేసారు. ఈ సందర్బంగా ఆయనను ఆర్.కృష్ణయ్య శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం లయన్స్ క్లబ్ విక్రమ్ పురి సహకారంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రోగులకు మరియు వారి పరిచారకులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమానికి హనుమంతరెడ్డి మాజీ అధ్యక్షుడు బి.సురేంద్రనాథ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.