వెన్నెపు శోభారాణి బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు గ్రహీత

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లాహైదరాబాద్,సెప్టెంబర్ 2:ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన.వి కే ఆర్ ఎంటర్టైన్మెంట్ మూడవ వార్షికోత్సవంలో నిర్వ హించిన షార్ట్ ఫిల్మ్ & ఫోక్ సాంగ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత వెన్నెపు శోభారాణి ‘5 జి లవ్ స్టోరీ’ చిత్రానికి బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తో పాటు శోభారాణి గారికి రూ.20,000 నగదు బహుమతిని కూడా ప్రదానం చేశారు.
అదేవిధంగా,మట్టి పాదాలు” పుస్తక రచయిత డాక్టర్ తుమ్మల దేవరావు గారికి గిడుగు రమమూర్తి పంతులు జాతీయ సాహితీ పురస్కారం దక్కింది. వీరిరువురికీ ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మయూరి హోటల్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సొసైటీ సభ్యులైన శోభారాణి మరియు దేవరావు గార్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఉప్పుల కృష్ణం రాజు, డాక్టర్ గోపాలకృష్ణ, టీఎన్జీవో అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. సొసైటీ అధ్యక్షులు షేక్ అన్సార్ పాషా,డేవిడ్, చారి, ఉమేష్,హరికృష్ణ, పాయం శంకర్,శ్యామ్, స్వదేశీ,వాణిశ్రీ, అనురాధ తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking