ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీలో జలమయమయ్యాయి. సోమవారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం సిద్దాపురం వాగును పరిశీలించారు.స్థానిక ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాసాన్ని కేంద్రాన్ని సందర్శించారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు గారితో పాటు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,కొండ శ్రీనివాస్ గంగోని బూరాజ్ కొంతం గణేష్ పూదరి అరవింద్ గడ్డింటి ప్రశాంత్ తదితరులు ఉన్నారు