ఆరోగ్య సమస్యలతో బాధపడే..కష్టకాలంలో ఉన్నవారికి వెస్సో ఆపన్నహస్తం

భీమవరం ఆగష్టు 21;ఆరోగ్య సమస్యలతో బాధపడే .. కష్టకాలంలో ఉన్నవారికి ‘వెస్సో’ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తు అండగా ఉంటుందని ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ గురజాపు తెలిపారు.పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నివాసి టేకు మణిమాల(37) ఇద్దరు పిల్లల తల్లి. భర్త బాధ్యతా రాహిత్యం కారణంగా, అయిదు సంవత్సరాలుగా స్థానిక బట్టల షాపులో నెలకు ₹6500/- జీతానికి ఉద్యోగం చేస్తూ, కుటుంబ పోషణ, పిల్లల సంరక్షణ బాధ్యతలను ఒక్కరే చూసుకుంటున్నారు.కడుపులో రెండు ప్రేగుల కలయిక కారణంగా, ఆమె గత కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నారు. ఇప్పటికే ఆమెకు మూడు సార్లు మేజర్ సర్జరీలు జరిగినవి. ఇప్పుడు 4వ సారి కూడ మేజర్ సర్జరీ చేయవలసిన పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రిలో లాప్రోస్కోప్ ద్వారా మాత్రమే సర్జరీ చేయుట మంచిదని, చికిత్సకు ఆర్థిక సహాయం కోసం స్థానిక నాయకుల ద్వారా ఆమె, వెస్సోని ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో మణిమాలకు రూ.30,000/-ల ఆర్థిక సహాయం అందచేసారు.ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు వరప్రసాద్ గురజాపు మాట్లాడుతూ కుటుంబ మరియు ఆరోగ్య సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తూ, కష్టకాలంలో ఉన్న మణిమాలకు ఆపన్నహస్తం అందించిన గౌరవ దాతలకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking