రేపు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఅరెస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ హాజరు కానున్న బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్: మహేష్ బిగాల .

 

ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఅరెస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కు (28 న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు రావు గారు హాజరు కానున్నారని బీఅరెస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది,రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు, ఈ సందర్బంగా 2018 లో విస్తృతంగా ఎన్నారైలు ప్రచారాన్ని నిర్వహించామని అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికలలో అటు సోషల్ మీడియా కాంపెయిన్ తో పేరు ప్రత్యక్షంగా కొన్ని నియోజక వర్గాలలో ఎన్నారైలు పర్యటించి కెసిఆర్ గారి ప్రభుత్వం చేపట్టుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రములో బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు రావు గారు ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతారని రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలి అనే దానిపై దిశా నిర్దేశం చేస్తారు అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking