మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బిగ్ షాక్..

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన అప్పాల వంశీ..
మహేష్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరిక.

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తన సొంత ఇలాకాలో గట్టి దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు మున్నూరు కాపు యువజన సంఘం మాజీ అధ్యక్షులు అప్పల వంశీ శుక్రవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్మల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు. మున్నురుకాపు యువజన సంఘం సభ్యులు గంజి రాజు, బండారి రాజేష్ లు సైతం బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యం రెడ్డి, మెడిసేమ్మ రాజు, సాదం అరవింద్, అయ్యన్న గారి రాజేందర్, వోడిసెల అర్జున్, వెంకటేష్, అల్లం భాస్కర్, శ్రీ రామోజీ నరేష్, సాయి, జుట్టు దినేష్, రాజు తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking