క్రికెట్ పోటీ లో కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల జట్టు విజయ భేరి..

హనుమకొండ ప్రజాబలం ప్రతినిధి: వరంగల్ బార్ అసోసియేషన్ తో ఆదివారం జరిగిన క్రికెట్ పోటీలో కరీంనగర్ న్యాయవాదుల జట్టు విజయ భేరి మోగించారు. వరంగల్ లోని ఫాతిమా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ క్రికెట్ మైదానం లో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ న్యాయవాదుల టీం నిర్ణిత 16 ఓవర్లలో 8 వికెట్స్ నష్టానికి 118 రన్స్ చేయగా అనంతరం బ్యాటింగ్ కు దిగిన కరీంనగర్ బార్ అసోసియేషన్ టీం 13 ఓవర్లలో 4 వికెట్స్ నష్టానికి లక్ష్యాన్ని చెందించి విజేతలుగా నిలిచారు. గెలిచిన కరీంనగర్ బార్ అసోసియేషన్ జట్టు తరుపున మడిపెల్లి రవి కెప్టెన్గా వ్యవహారించారు. విజేతలను కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking