ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు రాందేని చిన్న వేంకటేష్ పుట్టిన రోజు వేడుకలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఘనంగా ఆదివారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…కష్టపడ్డ వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది,అతి చిన్న వయసులోనే రాందేని చిన్న వేంకటేష్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడడం జరిగిందని,ఇలాంటి మరెన్నో జరుపుకుంటూ ఉన్నత పదవులు రాబోయే రోజుల్లో మరెన్నో పదవులతో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు.నాయకులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో కాంగ్రెస్ మండల పార్టీ,పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,సీనియర్ ఫ్లోర్ లిడర్ చెల్లా భూషణ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నలిమేల రాజు, సీనియర్ నాయకుడు రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.