నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి అందించడానికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

 

బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 : నరేంద్ర మోదీ పభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందాలనే ఉద్దేశంతో ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని మండలం పోతేపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గ్రామానికి వెళ్లి మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ…మోదీ ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుండి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాలు పంపి చిట్ట చివరి వ్యక్తి వరకు లబ్ధిదారులకు పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టారనీ అన్నారు.నరేంద్ర మోదీ సారధ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వస్తుందని పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోప్పు కిషన్,లక్షెట్టిపేటలోని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి,గుండా ప్రభాకర్,నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, బద్దే రామన్న,గంగన్న,చంద్రయ్య, కనుగాంటి మల్లేష్,తతిదరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking