ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లు, పనితీరును పరిశీలించిన … ప్రత్యేక అధికారి సంగీత IAS

 

మెదక్ తూప్రాన్ డిసెంబర్ 29 ప్రాజబలం న్యూస్ :-

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ప్రజా పాలన ప్రత్యేక అధికారిణి
సంగీత ఐఏఎస్ (IAS) , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్,
వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్ ఉమసత్యలింగం లతో కలిసి తూప్రాన్ మున్సిపాలిటీలోని మూడవ వార్డులో ,
చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో దరఖాస్తుల స్వీకరణ, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సంగీత ఐఏఎస్( IAS ) మాట్లాడుతూ పురుషులకు , మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఓకే కుటుంబం లోని సభ్యులు అందరికీ రేషన్ కార్డు లేకపోయినా వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు లో నమోదై వున్నా పేర్లను బట్టి , తల్లిదండ్రుల రేషన్ కార్డు నెంబర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు . ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తులో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపారు .

పురపాలక వార్డులలో, గ్రామలలో మహిళలకు , పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల మంచి స్పందన వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6′ గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనితెలిపారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరిస్తూ, దరఖాస్తులను నింపేందుకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అధికారులకు ఆదేశించారు.

ఏదేని కారణం వల్ల గ్రామ సభలో దరఖాస్తు చేసుకోలేని వారు, జనవరి 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయవచ్చని , ప్రతి దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు , అందేవిధంగా పనిచేయడమే ప్రభుత్వ అధికారుల లక్ష్యమని అన్నారు . ఏర్పాటు చేసిన ధరఖాస్తు కౌంటర్లను ఆమె పరిశీలించారు. దరఖాస్తు దారులకు తప్పనిసరిగా రశీదు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అదనపు కలెక్టర్ రమేష్ (ఎల్ బి ) మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తు కేంద్రాలను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నామని, లబ్ధిదారులకు కావలసిన అన్ని దరఖాస్తులు సంబంధిత కేంద్రాలలో సిద్ధంగా ఉంచామని, ప్రజాపాలన సభలలోనూ వీటిని ఉచితంగా అందించడం జరుగుతోందని ఆమెకు వివరించారు, ప్రతి కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జంలా నాయక్ , మున్సిపల్ చైర్మన్ , రవీందర్ గౌడ్,వైస్ చైర్మన్ శ్రీనివాస్ , , ఆర్ డి ఓ జయచంద్ర , మున్సిపల్ కమిషనర్ , కాజ మోహినోద్దిన్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు
చేగుంట తహసీల్దారు గియాస్ ఉన్నీసా బేగం ,
కమ్యూనిటీ హెల్త్ అధికారి బాల నర్సయ్యా , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking