గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవం.
కెసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరిగింది.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
కమలాపూర్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 31
గ్రామాలే దేశానికి కొమ్మలని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరై భవనాల ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గ్రామాల అభివృద్ధి పై దృష్టి కేంద్రీకరించారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు పెద్దపీట వేసి వాటి అభివృద్ధికి కెసిఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఒక్కో గ్రామం పై కెసిఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని అభివృద్ధి చేశారు అని అన్నారు. మొదటగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కెసిఆర్ హయాంలోనే ఈ గ్రామపంచాయతీకి 20 లక్షల నిధులు మంజూరయ్యాయని అన్నారు. కాన్పర్తి గ్రామపంచాయతీ భవనాలతో పాటు రెండు మహిళ భవనాలను కూడా ప్రారంభోత్సవం చేశారు. కన్నూర్ గ్రామపంచాయతీ భవన ప్రారంభం తో పాటు పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు వెలమ సంఘం భవనాన్ని కూడా ప్రారంభించారు. దేశరాజపల్లి గ్రామపంచాయితీ భవనం ప్రారంభించారు ,ఒక్కో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సుమారు 20 లక్షల వరకు నిధులు కేటాయించామని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణ్,
ఎంపీపీ రాణి శ్రీకాంత్,పిఎసిఎస్ చెర్మన్ సంపత్ రావు, ఇంద్రసేనా రెడ్డి, మాజీ జెడ్పిటిసి నవీన్ .సత్యనారాయణ రావు లతోపాటు గ్రామ సర్పంచులు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
