మల్కాపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

మెదక్ తూప్రాన్ జనవరి 31 ప్రజా బలం న్యూస్:-

జిల్లా పశుగణాబివృద్ది సంస్థ మరియు లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ విజయశేకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా పశువులకు కృత్రిమ గర్భధారణ, గర్భకోశ చికిత్స తో పాటు, నట్టల నివారణకు మందులు పంపిణీ చేశారు. అవసరమున్న పశువులకు టీకాలు వేశారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో 132 క్యాంపులకు గాను ఇప్పటివరకు 94 క్యాంపులను పూర్తి చేసినట్లు విజయశేఖర్ రెడ్డి ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని DLDA AD రాంజీ, మల్కాపూర్ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మండలం పశువైద్యాధికారి లక్ష్మీలు కోరారు.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ AD వెంకటయ్య,,DLDA AD రాంజీ,మండల పశువైద్య అధికారి లక్ష్మి,JVO ఫాని,మంజుల,లింగమూర్తి లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ చైర్మన్ సుఖేందర్, కార్తిక్,ప్రెసిడెంట్ దుర్గం అనిల్ కుమార్,సభ్యులు నాగరాజు,సంజీవ్,గోపలిమిత్ర జిల్లా సూపర్వైజర్ సత్యనారాయణ,గోపలమిత్ర అధ్యక్షులు అశోక్,రామస్వామి,శ్రీనివాస్, శేఖర్,OS లు మల్లేష్,రామకృష్ణ,చిరంజీవి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking