చదువుతోనే అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తాం

బాగా చదివుకుని ఉన్నతంగా ఎదగాలి

గ్రామ అభివృద్ధిలో కీలకమైనవి విద్య, ఆరోగ్య రంగాలు.

…జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి జనవరి 31 ప్రజ బలం ప్రతినిది:
గ్రామ అభివృద్ధికి విద్య ఆరోగ్య రంగాలు కీలకమైనవని, ఆ రెండు అభివృద్ధి చెందితే గ్రామమంతా అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం నారాయణఖేడ్,
సిర్గాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ,నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నారాయణఖేడ్ మండలం పంచగామ, సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను, సిర్గాపూర్ కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నిర్మించిన నూతన
భవనాన్ని, సర్వోదయ గ్రామసేవ ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యకు మించిన శక్తి ఏదీ లేదని, చదువుతోనే అన్ని విధాల వృద్ధిలోకి వస్తామన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని పట్టుదలతో చదివి, అనుకున్నది సాధించాలన్నారు. అన్నింటిని అధిగమించేలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, అనుకున్న గోల్ సాధించేలా నిబద్ధతతో చదవాలన్నారు. బాగా చదువుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
గ్రామ అభివృద్ధిలో కీలకమైనది విద్యా, ఆరోగ్య రంగాలని ఆ రెండు అభివృద్ధి చెందితే గ్రామమంతా అభివృద్ధి చెందుతుందన్నారు.


సిర్గాపూర్ గ్రామాల్లో సర్వోదయ గ్రామ సేవ ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని గ్రామ యువత ,విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించి ఆయా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ పంచాయతీల ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. గ్రామాభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని, ఏ సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ, పార్టీలతో ప్రమేయం లేకుండా పార్టీ రహితంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. గ్రామాల సర్పంచులు ఏవేని సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.
సిర్గా పూర్ పరిధిలో ఉన్న తాండాలన్నింటికీ బీటీ రోడ్స్ వేయాలని, మనూరు, సిర్గాపూర్ నారాయణఖేడ్ లలో ఆధార్ సెంటర్లు అదనంగా ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు.
అంతకుముందు కలెక్టర్ మాటలాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల సన్నద్దతలో భాగంగా నారాయణఖేడ్ సెగ్మెంట్ కు స్ట్రాంగ్ రూమ్ లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్ల కోసం నారాయణఖేడ్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఇన్కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్ సుధాకర్ నాయక్, ఆర్డిఓ వెంకటేష్, మండల తాసిల్దార్లు ,ఎంపీడీవోలు, ఇతర ప్రజాప్రతినిధులు,
ఆయా శాఖల అధికారులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking