మెదక్ తూప్రాన్ జనవరి 31 ప్రజా బలం న్యూస్:-మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక, కవి, తూప్రాన్ ముద్దుబిడ్డ, శ్రీ గద్దర్ 75వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజలకు తన పాటలతో మాటలతో చైతన్యం చేస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రజలకు గద్దర్ చేసినటువంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్ రావు, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న లింగ మల్లికార్జున్ గౌడ్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ కుమార్, సాయిబాబా ముదిరాజ్,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కురుమ శ్రీశైలం,
ఎమ్మార్పీఎస్ నాయకులు సర్గాల పరశురాములు, మహిళా అధ్యక్షురాలు మాధవి, కాలకంటి సత్యనారాయణ, గుండె పల్లి శేఖర్, నాగరాజు, శ్రీనివాస్ చారి, కాశీనాథ్, గడ్డం వెంకట్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
