ప్రజాబలం ప్రతినిధి:
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున గాంధీ భవన్ లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ నేత అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, విద్యార్థి నాయకుడిగా గుర్తించి తనకు భువనగిరి లోకసభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణ నేత, రాంబాబు నాయుడు, నాగార్జున, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.