నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక గుల్జార్ మస్జిద్ వద్ద శుక్రవారం ముస్లిం మత పెద్దలు ఎస్పీని శాలువతో సత్కరించారు. కుల మతాలకతీతంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఇదే సోదర భావం కొనసాగించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో పట్టణ సీఐ పురుషోత్తం చారి, కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫు, గుల్జార్ మస్జీద్ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ బషీర్ అలీ, మహమ్మద్ వహీద్, రఫీక్, అస్లాం ఖాన్ ,సజ్జాద్, ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking