ఐఎంసిసి జాతీయ అధ్యక్షులుగా పోకల కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నిక

చెన్నై సెప్టెంబర్ 29 (); ఐఎంసిసి జాతీయ అధ్యక్షులుగా పోకల కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయినారు.తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు జిల్లా సత్య మంగళం లో జరిగిన అన్నీ రాష్ట్రాల ,జాతీయ స్థాయి ప్రతినిధుల కౌన్సిల్ మీటింగ్ లో నేషనల్ ప్రెసిడెంట్ గా అన్ని విధాల అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోకల కిరణ్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.24 సంవత్సరాల మాదిగ దండోరా ఉద్యమంలో స్వార్ధం ఎరుగని కిరణ్ జాతి ఆత్మగౌరవం కోసం పడిన అనేక అవమానాలకు అనేక కేసులకు ,పోలీస్ దెబ్బలకు, జైల్ జీవితానికి,ఆర్థిక ఇబ్బందులు,అనారోగ్య పరిస్థితుల్లో కూడాజాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే పోరులో చావుకు ఎదురు నిలిచి, రొమ్ము చాచిన ధీరత్వానికి ఇచ్చిన గౌరవంగా, ఎవరికీ తలవంచని నిజాయితీ పరునిగా మాదిగ జాతిలో మేలిమి ముత్యములాగా, జాతి కోసం నిరంతరం వెలిగే కిరణం లా పోకల కిరణ్ వెలుగొందాడు. జాతీయస్థాయిలో నిలపడానికిపై లక్షణాలే కారణమని మునుముందు మాదిగ జాతిని రాజ్యాధికారం వైపు నడిపిస్తావని రాజకీయ పార్టీల గుండెల్లో భయం సృష్టిస్తావనే నమ్మకం మా అందరిలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నా మని వక్తలు పేర్కొన్నారు.భవిష్యత్తులో దక్షిణ భారతంలో ఉత్తర భారతాన మాదిగ మరియు చమార్ సమాజానికి ద్రోహం చేస్తున్న ద్రోహులను చరపట్టే కొదమసింహంలా పోరాడతావనే నమ్మకాన్ని వక్తలు వ్యక్తం చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking