సీయం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

 

నూత‌నం మండ‌లంగా పొన్కల్
ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం
హ‌ర్షం వ్య‌క్తం చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
సీయం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్ జిల్లా నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పొన్క‌ల్ ను నూత‌నంగా మండ‌లంగా ప్ర‌క‌టిస్తూ. ప్ర‌భుత్వం ప్రాథ‌మిక నోటిపికేష‌న్ జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సీయం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హ‌రీష్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పొన్క‌ల్ మండ‌ల వాసుల‌కు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు చెప్పారు.
పొన్కల్ మండ‌ల ప‌రిధిలోని గ్రామాలు ఇవే..
పొన్క‌ల్, క‌మ‌ల్ కోట్, న‌ల్దుర్తి, దేవతాపూర్, వెంక‌టాపూర్, బండ‌ల ఖానాపూర్, పోతారం, అనంత‌పేట్, కొత్త టింబ‌రేణి (ఆర్.సి), ఆద‌ర్శ‌న‌గ‌ర్ (ఆర్.సి) కొత్తూర్, ఎదుదూర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking