వంద రోజుల్లో కాంగ్రెస్ హామీలు నెరవేరుస్తాం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దాసరి లక్ష్మణ్ ఆయన అనుచరులు 300 మంది శుక్రవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలలు మిగిలాయని అన్నారు. తెలంగాణలో అధికారమే సోనియాగాంధీ కల అని, దానిని సాకారం చేసేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని అన్నారు.దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికల్లో నిర్మల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.కార్యక్రమం లో సారంగపూర్ జెడ్పిటీసి పత్తిరెడ్డి రాజేశ్వర్,మాజీ జెడ్పిటీసి లు బొల్లోజీ నర్సయ్య,రొడ్డ మారుతి, ఆది, విలాస్ రావ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking