ప్రజాబలం దినపత్రిక -మెదక్ జిల్లా ప్రతినిధి
17.09.2024:
భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ మాట్లాడుతూ .. ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం విశ్వకర్మ జయంతిని యంత్రాలు ఆయుధాలతో పూజించడం హిందూ సనాతన ధర్మం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీగా అభిప్రాయపడ్డారు
విశ్వ సృష్టిలో బ్రహ్మదేవునికి సహాయపడ్డ విశ్వకర్మ ..ప్రపంచ హస్త కళాకారుడిగా దేవతలకు ఆయుధాల రూపకర్తగా.. వాస్తు శిల్పిగా ప్రపంచంలో మొదటి ఆర్కిటెక్ అండ్ ఇంజనీర్ గా విశ్వకర్మను విశ్వసిస్తారని .. విశ్వకర్మ జయంతి వేడుకలు ప్రతి హిందువు జరుపుకోవలసిన అవసరం ఉన్నది భవిష్యత్తు భావితరాల పిల్లలకు విశ్వకర్మ చరిత్ర జయంతి ఉత్సవాల గురించి వివరంగా పిల్లలకు తెలియజేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ
మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంలన్ రెడ్డి శ్రీనివాస్ జిల్లా నాయకులు వెలుమల సిద్ధిరాములు నందా రెడ్డి చింతల శేఖర్ సుంకోజి రాజు మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కృష్ణ రమేష్ లక్ష్మీకాంతం పూనా రవి కుమార్ మురళి అనిల్ తదితరులు పాల్గొన్నారు