బాధితుడిని పరామర్శించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరం కనకయ్య మల్లి బాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 07 (ప్రజాబలం) ఖమ్మం ఇటీవల ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి, కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం లో చికిత్స పొందుతున్న కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన పల్లె వెంకట్రాములు ను ఈరోజు ఉదయం 10 గంటలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సాయంత్రం 3 గంటలకు భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అతనికి మనోధైర్యం కల్పించి, మేమున్నామంటూ భరోసా కల్పించారు. వైద్యులను సంప్రదించి వైద్యం గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఫతే మహ్మద్, మడుగు సాంబమూర్తిరావూరి సతీష్, బోళ్ల సూర్యం , శేఖర్ పల్లె ఉపేందర్, నవీన్, కుటుంబ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking