ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 07 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని ప్రజలకు లక్షెట్టిపేట నాయకుడు,కరీంనగర్ కో -ఆప్షన్ మెంబెర్ సయ్యద్ అంజాద్ అలీ శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా భారీ ఎత్తున ఇఫ్తార్ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్,కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై లక్ష్మణ్,లక్షెట్టిపేట కో-ఆప్షన్ సయ్యద్ సాహిద్ అలీ,నాయకులు జగన్మోహన్ రెడ్డి,మెట్టు రాజు తదితరులు హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దివాకర్ రావు,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య లు స్వయంగా ముస్లీమ్ సోదరులకు ఇఫ్తార్ విందు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.