ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వినతి మేరకు నియోజిక వర్గ ప్రజలకు కంటి పరీక్షలు చేయండి
శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరిన మంత్రి కేటీఆర్
శంషాబాద్ ( ప్రజాబలం) ప్రతీ ఒక్కరూ కంటి సమస్యల పై దృష్టి సారించాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.రాజేంద్ర నగర్ నియోజకర్గంలో నర్సింగ్ లో శుక్రవారం శంకర్ కంటి ఆసుపత్రి నీ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ను ఘనంగా సన్మానించారు.తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు యాంత్రిక జీవనం లో పడి ఆరోగ్య సమస్యల పై దృష్టి సారించడం లేదని అలా ఉండడం వలన జబ్బులు ముదిరి ప్రాణాల మీదికి రాక ముందే మనం మన ఆరోగ్యం పట్ల ఎప్పటి కప్పుడు దృష్టి సారించాలి అన్నారు.అదే విధంగా.రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నియోజక వర్గ ప్రజలకు చిన్నా పెద్దలకు కంటి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు కాబట్టి శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యం తప్పక ఎమ్మెల్యే కోరిక మేరకు నియోజిక వర్గ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరుతున్నానని మంత్రి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం లో బాగస్వామి లు కావాలి అన్నారు.
