నేడు భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

 

ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారన్నారు. పలు శుభకార్యక్రమాలకు కూడా హాజరవుతారని తెలిపారు. కావున ఈ పర్యటనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking