నేడు ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో జరిగే అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొంటారన్నారు. ఖమ్మం నగరంలోని నెహ్రునగర్, గణేష్ నగర్, స్వర్ణభారతి కల్యాణమండపాల్లో జరిగే పలు శుభ కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు. కారేపల్లి మండలంలోని చీమలపాడు గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగే ఇఫ్తార్ విందుతో పాటు పలు బాధిత కుటంబాలను పరామర్శించి ఓదారుస్తారని తెలిపారు. కావున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking