నిర్దిష్ట ప్రణాళికతో సజావుగా ధాన్యం సేకరణ జరగాలి

 

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదు

జిల్లాలో 209 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ఏప్రిల్ 13 ప్రజ బలం ప్రతినిది:
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యాసంగి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్ళపై కలెక్టరే ట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.
తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిష్టితుల్లోనూ రైతులు నష్టపోకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు.
నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వానిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని, జిల్లాలో 2,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అంచనా కాలదన్నారు. అవసరం ఉన్న చోట, ధాన్యం పండించే ప్రతి గ్రామంలో డిమాండ్ ఉన్న మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ఏఈఓ ను ఇన్చార్జిగా నియమించామని, అదేవిధంగా ఒక విఆర్ఏ ఉంటారని, వీరిపై సూపర్వైజర్ అధికారులు ఉంటారని తెలిపారు.
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, నీడ కోసం షెడ్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి వసతులు ఉండాలన్నారు.
పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, అవసరమైన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే టాబ్ ఎంట్రీ చేయాలని, 72 గంటలలోపు ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో జమ అవుతుంది అన్నారు.
నాణ్యతాప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం చేయరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాలలో అవసరమైనన్ని గన్నీ బ్యాగులు, ప్యా డి క్లీనర్స్ ,వేయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచాలన్నారు.
అన్లోడింగ్,మరియు కస్టమ్ మిల్లింగ్ ను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో బియ్యంను డెలివరీ చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు.
అనంతరం పంటల మద్దతు ధరకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యం, డీ ఎస్ ఓ వనజాత, డీసీఓ ప్రసాద్, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, మార్కెటింగ్ అధికారి, సివిల్ సప్లై స్ డి ఎం సుగుణ భాయ్, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఏ ఓ లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, రైస్ మిల్లర్లు, ప్యాక్ కేంద్రాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking