మీ సేవా కేంద్రాల నిర్వహణ తీరును తహసిల్దార్లు పర్యవేక్షణ చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం నుండి రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజల నుండి నామమాత్రపు రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకునే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయన తహసిల్దార్లను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులు సత్వరం పరిష్కరించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి పెండింగ్ ఉన్న 94 కేసులక తక్షణమే కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పారు. గోదావరి వరదల ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఇరిగేషన్ అధికారులు కార్యాచరణ నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను వరదల బారి నుండి కాపాడుకునేందుకు వరద ప్రభావిత మండలాలల్లో చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. చౌకదుకాణల నిర్వహణ తీరును తనిఖీ చేయాలని, లోపాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేలిముద్రలు పడకపోవడం వల్ల నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. టేకులపల్లి, అశ్వాపురం మండలాల్లో ఆధార్ సేవలు కొరకు చర్యలు తీసుకోవాలని ఈడియంను ఆదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా విచారణ నిర్వహించాలని చెప్పారు. 507 దరఖాస్తులు విచారణ పూర్తయిందని, 308 దరఖాస్తులు విచారణ నిర్వహించాల్సి ఉన్నదని వారం రోజుల్లో విచారణ పూర్తి చేయాలని చెప్పారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరకు ప్రతిపాదనలు అందచేయాలని పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసిన లబ్దిదారులు మరణించినట్లయితే వారి నామినిలకు పట్టాలు జారీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డూప్లికేటు ఫోటోలు ఆధారంగా తొలగించిన ఓటరు జాబితా వివరాలను విచారణ నిర్వహించాలని చెప్పారు. పుట్టిన తేది తప్పుగా నమోదైన ఓటర్లు వివరాలను ఫారం 8 ద్వారా సరిచేయాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఓటుహక్కు చాలా ప్రధానమైనదని, ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా విచారణ చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వారిగా 5, 10 శాతం తొలగించిన ఓటరు జాబితాననుసరించి తిరిగి విచారణ చేపట్టాలని చెప్పారు. బూతుస్థాయి అధికారులుగా ప్రైవేట్ సిబ్బంది ఉండొద్దని, అలా ఉన్నట్లయితే వారి వివరాలను అందచేయాలని చెప్పారు. ఓటరు జాబితాలో వచ్చిన ప్రతి రికార్డులు బద్రపరచాలని చెప్పారు. నూతనంగా వచ్చిన 6,7,8 విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, పిఆర్ ఈఈ సుధాకర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజి, సర్వే ఏడి కుసుమకుమారి, డిఎస్ఓ మల్లికార్జున్, పౌర సరఫరాల డియం త్రినాద్, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, ఏఓ గన్యా అన్ని మండలాల తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking