జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 3 హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యువ నాయకుడు వోడితల ప్రణవ్ బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నియోజకవర్గంలోని హుజరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాలలో జరిగిన పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన ప్రణవ్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆప్యాయతతో పలకరిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానిస్తూ ఆయన రాక కోసం ఎదురుచూస్తూ ఘన స్వాగతం పలికారు. యువనేత రాకను ఆస్వాదించిన అభిమానులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్ కసుభోజుల వెంకన్న అన్నం ప్రవీణ్ చింతల శ్యాంసుందర్ రెడ్డి మహమ్మద్ సాహెబ్ హుస్సేన్ పాతకాల అనిల్ మిడిదొడ్డి రాజు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.