ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలాంబ్రాలు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. శ్రీరామ నవమిని పురస్కరించుకొని భద్రాద్రి లో జరిగే శ్రీ సీతా రాముల వారి కల్యాణ తలాంబ్రాలను అక్కడికి వెళ్లలేని భక్తుల కు అందచేయాలని టి. ఎస్.ఆర్టీసీ మరియు దేవాదాయ శాఖ సహకారము తో రాములోరి తలబ్రాలను 04.04.2024 నుండి ప్రారంభించ బోతుంది.
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకరార్థం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని కార్గో పార్సిల్ ( లాజిస్టిక్ )కేంద్రాలలో ఒక పాకెట్ కు 151/-రూ!! చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి.ఈ సారి ఆన్ లైన్ మరియు మ్యానివల్ గా బుక్ చేసుకునే సౌకర్యం కూడా కనిపించడం జరిగింది.
శ్రీ సీతారాముల కళ్యానోత్సవం అనంతరం ఈ తలాంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు ఇంటి వద్దకే చేరవేస్తారు.ఈ తలాంబ్రాలకు ఎంతో విషిష్టత ఉంది.నియమ నిష్టలతో వడ్లను గోటితో వొలిచి తీసిన కోటి బియ్యంగింజలను తలాంబ్రాలను ఎన్నో ఏళ్లుగా కళ్యాణంలో ఉపయోగిస్తారు.తమ సంస్థ మీద ఉన్న విశ్వసంతో గత రెండు సం!!రాలుగా మంచి స్పందన రావడం తో ఈ సం!!రం కూడా భద్రాచలం వెళ్ళ లేని భక్తులకొరకు కొనసాగించడం జరిగింది.
ఈ తలాంబ్రాలను తేదీ 04.04.2024 నుండి 18.04.2024 వరకు బుక్ చేసుకునే సౌకర్యం కలిపించడం జరిగింది.కావున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు ఆర్టీసీ కార్గో లాజిస్టిక్ కలిపించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగ పరచుకోవాలని రీజినల్ మేనేజర్ శ్రీ పి.సొలొమాన్ తెలిపారు.
ఫోన్ ద్వారా కూడా వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవాలన్నారు.
ఆదిలాబాద్,ఉట్నూర్ డిపో:9154298531
ఆసిఫాబాద్ డిపో:9154298534
మంచిర్యాల డిపో:9154298541
నిర్మల్ డిపో:9154298542
భైంసా డిపో:9666128528
రీజినల్ కార్యాలయము:9154298552,9154298553
లో సంప్రదించాలని ఆయన కోరారు.
తలాంబ్రాల పోస్టర్ విడుదల చేసిన వారిలో డిప్యూటీ ఆర్.ఎం.( ఎమ్ )ప్రవీణ్ కుమార్ పి.వో.శ్రీమతి ఆర్.జి.జిబ్ల,కార్గో రీజినల్ ఎగ్జిక్యూటివ్ లు ప్రశాంత్ రెడ్డి,సాయన్న పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking