ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి : గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతుంది.
రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ లో మార్నింగ్ వాక్ లో భాగంగా బుధవారం అభ్యర్థి రోజు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారితో కలిసి పరమేశ్వర్ రెడ్డి ప్రచారం చేశారు.
దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మల్కాజిగిరి పార్లమెంటు నుంచి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు.
ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డిని కూడా ఇదే తరహాలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో కంది ఆగి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి, కరిపే శంకర్ వంజరి, సుర్వి మురళి గౌడ్, తావీడబోయిన గిరిబాబు గారు, శ్రవణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కరిపే అనిల్ కుమార్ వంజరి, ఆకారపు అరుణ్ ,రఘపతి రెడ్డి, గణేష్ నాయక్, లింగంపల్లి రామకృష, కరిపే పవన్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,పేట మురళి ముదిరాజ్, గరిక సుధాకర్, ధర్మ నాయక్, ఉపేందర్ రెడ్డి, సల్మాన్ బాబు ,భాస్కర్ గంగపుత్ర ,రాజు, సందీప్ ,రామ్ నాయక్ భాస్కర్, సత్తి, సతీష్ గౌడ్ ,విసు ,సతీష్ ,పాల్గొన్నారు.