బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణలో చోటు లేదు డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణలో చోటు లేదని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. గంజల్ గ్రామ ఉపసర్పంచ్ ముత్తన్న ఆధ్వర్యం లో సోన్ మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఫక్రుద్దీన్ నేతృత్వం లో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి శ్రీహరి రావు పార్టీ కండువాలు కప్పి హస్తం పార్టీలోకి స్వాగతించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నేతంలో 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking