రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవిఎం, వివి ప్యాడ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..  బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలసి ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ  నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని తెలిపారు. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు ఆన్ లైన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు. నిర్మల్ నియోజకవర్గం పరిధిలో 382 కంట్రోల్ యూనిట్లు, 382 బ్యాలెట్ యూనిట్లు, 413 వివి ప్యాట్ లు కేటాయించగా, ఖానాపూర్ నియోజకవర్గానికి 385 కంట్రోల్ యూనిట్ లు, 385 బ్యాలెట్ యూనిట్లు, 415 వివి ప్యాట్ లను, ఆలాగే ముధోల్ నియోజకవర్గంలో కంట్రోల్ యూనిట్లు 388, బ్యాలెట్ యూనిట్లు 388, 419 వివి ప్యాట్ లను ఆన్ లైన్ విధానం ద్వారా ర్యాండమైజేషన్ నిర్వహించి కేటాయించడం జరిగిందన్నారు. మొదటి దశ ర్యాండమైజేషన్ కు సంబంధించిన రిపోర్టు కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరి పాటించాలని అన్నారు. ప్రచారానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలకు సువిధ యాప్ ద్వారా అనుమతులు పొందాలని తెలిపారు. నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, ఈడిఎం నదీమ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking