జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 9
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో జె ఎస్ ఈ బైక్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం వల్ల ప్రమాదకరమైన కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉంటుందని పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అందువల్ల వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు దృష్టి సారించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బైకులను విరివిగా ప్రతి ఒక్కరు వాడినట్లయితే పెట్రోల్ డీజిల్ వంటి ఇబ్బందులు ఉండబోవని ప్రతి ఒక్కరూ కాలుష్యాన్ని నియంత్రించడానికి దోహద పడినట్లు అవుతుందని ప్రణవ్ అన్నారు. రానున్న రోజులలో హుజురాబాద్ ప్రాంతంలోనే ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేసే ఫ్యాక్టరీని నెలకొల్పే అవకాశం ఉన్నట్లు షోరూం నిర్వాహకులు తనకు చెప్పారని ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మన ప్రాంతానికి చెందిన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క హుజరాబాద్ ప్రాంతంలోనే ఎలక్ట్రిక్ బైక్ లకు సంబంధించిన ఎనిమిది డీలర్ షిప్ లు ఈ ప్రాంతానికే ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలపడం ఆనందదాయకంగా ఉందని ప్రస్తుతానికి 8 మోడల్స్ అందుబాటులో ఉన్నట్లు వారు చెప్పారని నూతన టెక్నాలజీతో రూపొందించబడిన ఈ ఎలక్ట్రి క్ బైకులను ఒకే ఒక చార్జింగ్ తో రికార్డు స్థాయిలో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. జమ్మికుంటలో నెలకొల్పిన ఎలక్ట్రిక్ బైక్ షోరూంను సందర్శించి అందుబాటులో ఉన్న ఎనిమిది మోడల్స్ లలో తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావలసిందిగా ప్రణవ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.