ప్రభుత్వ భూముల సర్వే ను పైలెట్ ప్రాజెక్టు క్రింద నిర్వహించి, కెఎంఎల్ మ్యాప్ (గూగుల్) లో పొందపరచాలి
జిల్లా కలెక్టర్ గౌతమ్,అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 9:
జిల్లాలోని ప్రభుత్వము భూములను పరిరక్షించుకొనుటకు, భూముల సర్వే ను పైలెట్ ప్రాజెక్టు క్రింద నిర్వహించి, కెఎంఎల్ మ్యాప్ (గూగుల్) లో పొందపరచాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో జిల్లాలోని భూముల సర్వే పై అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితమైన ప్రమాణాలతో జిల్లాలోని నిషేధిత భూములు, రక్షణ శాఖ, అటవీశాఖ, సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములను సర్వే చేసి, ఎలాంటి పొరపాటు లేకుండా పక్కాగా సర్వే నిర్వహించి, ఆ భూముల వివరాలను సాంకేతికంగా కిహోల్ మార్కప్ లాంగ్వేజ్ (KML) మ్యాప్ (గూగుల్) లో త్వరితగతిన పొందపరచాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. LRS లో భాగంగా లేవట్ల రెగ్యులరైజేషన్ బిల్డింగ్ పర్మిషన్స్TG ఐపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి KML మ్యాప్ లో సూచించబడిన భూముల వివరముల ప్రకారము అనుమతులు ఇచ్చుటకు సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ భూముల వివరముల ను మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలలో శాశ్వత రికార్డుల గా సిద్ధం చేసి భద్రపరచాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రక్షణ శాఖ, అటవీశాఖ భూములకు సంబంధించి సరిహద్దులను గుర్తించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు, తాసిల్దారులు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.